మాట నిలబెట్టుకున్న త్యాగమూర్తి సోనియా

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  09 : నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు, అభిమానుల మధ్యలో శనివారం  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి  సోనియా గాంధీ జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి,  మిఠాయిలు పంచిసంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ ప్రజల 60 ఏళ్ల బాధలను  అర్థం చేసుకొని  సోనియా గాంధీ తెలంగాణ  ఏర్పాటుకు సహకారం అందించారని అన్నారు. తెలంగాణ యువకుల బలిదానాలకు ముగింపు పలకాలని  తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన గొప్ప తల్లి సోనియా గాంధీ అని కొనియాడారు. సోనియా  తెలంగాణ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ  కార్యక్రమంలో  నాయకులు ముప్పు రామిరెడ్డి,  చిన్నంరాజు సతీష్ గౌడ్,  పంగ హరిబాబు, గూడూరు చక్రపాణి గౌడ్, దాసోహం చిన్న, కిలారి శ్రీనివాస్, బిక్షపతి, రాంరెడ్డి, చిట్యాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *