మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 23: మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి తండ్రి జిల్లెల గూడ గ్రామ మాజీ సర్పంచ్ తీగల సత్యనారాయణ రెడ్డి భౌతికకాయానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందిన తీగల సత్యనారాయణ రెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సత్యనారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగా రెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ తీగల అనిత రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు నివాళులు అర్పించారు.



