మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 16: భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి సేవలు చిరస్మరణీయమని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు పెండ్యాల నర్సింహ కొనియాడారు. బుధవారం అటల్ బీహారీ వాజ్ పేయి 5వ వర్ధంతిని పురస్కరించుకుని.. ఏంఏంసి ప్రధాన కార్యదర్శులు గాజుల మధు, కే.సోమేశ్వర్ అధ్వర్యంలో జిల్లేల గూడ లలిత నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెండ్యాల నర్సింహ ముఖ్య అతిథిగా హాజరై, వాజ్ పేయి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెండ్యాల నర్సింహ మాట్లాడుతూ..దేశం గర్వించదగ్గ గొప్ప మహా నాయకుడు అటల్ బీహారీ వాజ్ పేయి అని అన్నారు. వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నేటి యువత వారిని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూల ప్రభాకర్, బెల్లంకొండ నాగరాజు, యాదగిరి యాదవ్, ఆవుల సత్తయ్య, హరినాథ్ రెడ్డి, గోపీనాథ్, రఘు, రమేష్ ముదిరాజ్, జెడి కుమార్, పాలకుర్తి వేణుగోపాల్ రెడ్డి, విక్కి సాగర్, నవీన్, మల్లేష్, గోగికర్ భాస్కర్, దశరత్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.



