మా సంతకాల ఫోర్జరీతో కేసు వేశారు

– నిందితులపై చర్యలు తీసుకోవాలని రజకుల డిమాండ్‌

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 23: యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో కొంతమంది తమ సంతకాలు ఫోర్జరీ చేసి తమకు తెలియకుండానే కోర్టులో కేసులు వేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామంలోని పలువురు రజకులు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామంలోని సర్వే నెం.376లో 47 ఎకరాల భూమిని తమ కులస్థులకు ప్రభుత్వం గతంలో కేటాయించిందని తెలిపారు. ఈ భూమికి సంబంధించి 2020లో తమ ప్రమేయం లేకుండా 12మంది తమ కులస్తుల ఫోర్జరీ సంతకాలతో ఓఎస్‌ నెంబర్‌ 5ని తయారు చేసి గ్రామానికి చెందిన వేరే వ్యక్తులపై కోర్టులో కేసులు వేశారని తెలిపారు. అసలు తమకు తెలియకుండా తమ సంతకాలతో కేసులు ఎలా వేశారో అర్థం కావడం లేదని వారు వాపోయారు. ఇందులో గ్రామానికి చెందిన గడసంతల వెంకటేష్‌ ప్రమేయం ఉందని, ఆయనతోపాటు ఫోర్జరీకి సహాకరించిన అధికారులు, రాజకీయ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో బాధితులు గడసంతుల మల్లేష్‌, కొమ్మరాజు చంద్రయ్య, కొమ్మరాజు లక్ష్మయ్య, కొమ్మరాజు సత్యనారాయణ, వడ్లకొండ బుచ్చయ్య, గడసంతుల శేఖర్‌లు పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *