కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 6: మహేశ్వరం గడ్డపై కాంగ్రెస్ జెండా ఈ ఎన్నికల్లో కూడ ఎగురవేస్తామని కందుకూరు మండలం ఐఎన్ టియుసి అధ్యక్షులు సురేందర్ దీమా వ్యక్తం చేశారు.సోమవారం కటికపల్లిలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నాడు, నేడు ఎప్పటికైనా మహేశ్వరం గడ్డ కాంగ్రెస్ అడ్డగా మారిందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ ను మాత్రమే నమ్ముకున్నారని ఇతర పార్టీలకు ఇక్కడ స్థానం లేదని ఆయన పేర్కొన్నారు. కందుకూరు మండలంలో కార్యకర్తలు, నాయకులు,ప్రజలు పార్టీకి బలంగా ఉన్నారని శతవిధాల ఇతర పార్టీలు ప్రయత్నం చేసిన గెలవలేరని ఆయన తెలిపారు.మహేశ్వరంలో ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ విజయదుండుబి మోగీస్తుందని ఆయన పేర్కొన్నారు.
మహేశ్వరంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము





