మహేశ్వరంలో కలయిక లేని కాంగ్రెస్

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 30 : మహేశ్వరం నియోజక వర్గంలో కలయిక లేని కాంగ్రెస్ గా మారింది.ప్రచారంలో మాత్రం  బిఆర్ఎస్ దూసుకుపోతుంది.కాంగ్రెస్ లో నిన్న మొన్నటి వరకు ప్రగల్భాలు పలికిన నేతలు టిక్కెట్ రాక డీలా పడిపొయారనెది స్పష్టంగా అర్థమవుతోందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దేప భాస్కర్ రెడ్డి ఒకవైపు చిగురింతపారిజాత నరసింహారెడ్డి ఒకవైపుఏనుగు జంగారెడ్డి మరోవైపు విచిత్ర వేషాధారంలో కాంగ్రెస్ ఉండగా బిఆర్ఎస్ కు దీటుగా బిజెపి ప్రచారం నిర్వహిస్తున్నారు.మహేశ్వరంలో జెండా ఎగరవేసేది ఎవరు? అన్న మీమాంసంలో పడ్డ ప్రజలు ఓటర్లు రాజకీయ విశ్లేషకులను సైతం అంతు పట్టడం లేదు.మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్కు అడ్డాగా ఉన్న ఎమ్మెల్యే సీటు నేడు బిఆర్ఎస్ కంచుకోటాల మారనుందని విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.2018 ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి పై విజయం సాధించి అభివృద్ధి నిమిత్తం కేసీఆర్ ప్రభుత్వంలో చేరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సకాలంలో అందే విధంగా కృషి చేసిన ఘనత మంత్రికి ఉందని పలువురు భావిస్తున్నారు.బిజెపి తరపున పోటీ చేసిన అందెల శ్రీరాములు యాదవ్ దాదాపు 40 వేల ఓట్లు దండుకుని ప్రజల మనసులో నిలచిపోయారని ఆ పార్టీ కార్యకర్తలు ప్రజలు అనుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎలాంటి పట్టులేని భాజపా కేవలం అందేలా శ్రీరాములు యాదవ్ రాకతో స్థానికంగా భాజాప పార్టికి పట్టు నిలిపారని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఈ ఎన్నికల్లో బిజెపి,బిఆర్ఎస్ మధ్యన పోటీ ఉంటుందా లేక త్రిముక పోటీ ఉంటుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించిన ఆశావాహులు దేపా భాస్కర్ రెడ్డి,జిల్లా పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి,కందుకూరు మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి,అమరేందర్ రెడ్డిలకు అధిష్టానం టికెట్ ఇవ్వకపోగా మేడ్చల్ లో పోటీ చేసిన కిచ్చన్న గారి లక్ష్మారెడ్డిని మహేశ్వరం బరిలో నిలపడం దేనికి సంకేతం అని కాంగ్రెస్ పార్టీ దిగువ ఉన్న నాయకులకు కార్యకర్తలకు అంతు పట్టడం లేదు అని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు.ఒకానొక క్రమంలో టికెట్ తనకే వస్తుందని దేప బాస్కర్ రెడ్డి, చల్లా నర్సింహారెడ్డి,పారిజాత నర్సింహారెడ్డి,ఏనుగు జంగారెడ్డి,అమరేందర్ రెడ్డిలు గొప్పలు చెప్పుకున్న చివరకు లక్ష్మారెడ్డిని రంగంలోకి దింపడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఆదివారం దేప భాస్కర్ రెడ్డి,చిగురింత పారిజాత సింహారెడ్డి పలు ఫంక్షన్ హాల్లో కార్యకర్తలకు సమావేశం నిర్వహించగా ఏనుగు జంగారెడ్డితో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి రాత్రి వేళలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం ఎందుకని కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో,కార్యకర్తల్లో గుబులు రేగుతుంది.దీనితో మహేశ్వరం నియోజకవర్గంలో రాజకీయ రసవత్తరం ఎలా ఉంటుందో ఓటర్ నాడీ బట్టి తెలుస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఏది ఏమైనా మూడోసారి కూడా సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రాంతం నుంచి గెలవడం సునాయాసంగా మారడం ఖాయమని పరిశీలకుల అభిప్రాయం.కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిని ప్రకటించిన నాయకుల్లో కార్యకర్తల్లో సందేహాలు మొదలవుతున్నాయి కిచ్చన్న గారికి సపోర్ట్ చేయలేమని కొందరు లోకల్ గా ఉన్న వారికి మాత్రమే బరిలోకి దిగితే వారికి వెన్నంటి ఉంటామని కిందిస్థాయి నాయకులు కార్యకర్తలు అంటున్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరంలో నిలుస్తుందా ఓటమి చెందుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *