మహిళా సాధికారత దిశగా తెలంగాణ తొలి అడుగు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 9 : మహిళా సాధికారత దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యం లోని తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని టీపీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆమనగల్లు, కడ్తాల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రా కల సాకారం చేసిన మన తెలంగాణ అమ్మ  సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటిలలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా రూ.10 లక్షల వైద్య సౌకర్య పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగిందన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుని పణంగా పెట్టిన గొప్ప వ్యక్తి అని, అణువణువునా భారతీయతను నింపుకొని ఈ దేశ శ్రేయస్సు కోసం మీరు చేసిన త్యాగాలు, కృషి అద్భుతం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తెలంగాణ ప్రజలు ఆమె రుణం తీర్చుకున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ప్రజామోద్యమైన జనరంజక పాలన కొనసాగుతుందన్నారు. అవినీతి అక్రమాలకు తావులేకుండా ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.ఆరు గ్యారెంటీ హామీలలో సోనియా గాంధీ గారి పుట్టిన రోజు నుంచే ప్రారంభించడం సంతోషకరమన్నారు. ప్రజల దీవెనలతో తల్లి సోనియమ్మ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించి, తన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ ఎంపీపీ అనిత విజయ్, డిసిసి ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కొండల్ రెడ్డి, యాట నరసింహ, జగన్, కృష్ణ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, అలీం, శ్రీకాంత్, గాజుల శ్రీను, వాటర్ బాబా, మండ్లీ రాములు, రంజ్యా, నరేష్, రహీం, మైసయ్య, కుమార్, రాఘవేందర్, నాజర్, వస్పుల మావయ్య, వస్పుల శ్రీశైలం, ఫరీద్, డిసిసి ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ, సింగిల్ విండో డైరెక్టర్ చేగురి వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు జాంగిర్ బాబా, సేవాలాల్ మండల అధ్యక్షులు లక్ష్మయ్య, టౌన్ వర్కింగ్ అధ్యక్షుడు రాంచందర్ నాయక్, నాయకులు మల్లయ్య, మల్లేష్, సత్యం యాదవ్, వేణు పంతులు, భాస్కర్ రెడ్డి, మహేష్, శ్రీను, అశోక్, సేవ్య నాయక్, క్యామ రాజేష్, కిషన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు హీరాసింగ్, షాబుద్దీన్, టౌన్ అధ్యక్షులు భాను కిరణ్, ఇమ్రాన్ బాబా, శ్రీకాంత్, మణికిరణ్, వంశీ, మహేష్, రామకృష్ణ, తులసిరామ్ రమేష్, శ్రీను, లక్ష్మణ్, శ్రీశైలం, జంగయ్య, చందోజి, సిత్య, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *