మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ అరుణ భాయి

సంగారెడ్డి,ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : సంగారెడ్డి మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ కే అరుణ భాయి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న డాక్టర్ అరుణ బాయి పదోన్నతి మీద రెగ్యులర్ ప్రిన్సిపాల్ గా సంగారెడ్డికి బదిలీ అయి వచ్చారు. నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రిన్సిపాల్ కు కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అరుణ బాయి మాట్లాడుతూ విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన అందిస్తూ కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చేందుకు అందరి సహాయ సహకారాలు తీసుకుంటానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాబోధనకు, విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఎంతో సహకరిస్తున్నదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *