ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : నగరంలో తొలిసారి ప్రముఖ బైక్ రెంటల్ కంపెనీ రాయల్ బ్రదర్స్, యమహా మోటార్ కే లిమిటెడ్ జపాన్ కు చెందిన మొదటి అనుబంధ సంస్థ అయిన మోటో బిజినెస్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎంబిఎస్ఐ), భాగస్వామ్యంతో ‘ఆర్.బి మహిళల కోసం’ జత కలిసి మహిళలకు బైక్ డ్రైవింగ్ ప్రొఫెషనల్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ‘ఆర్.బి ఫర్ ఉమెన్’ హైదరాబాద్ నగరం అంతటా మహిళా సాధికారత, స్వాతంత్య్రం వేడుకలను, మార్పుని తీసుకువస్తుందని అన్నారు. ‘ఆర్.బి ఫర్ ఉమెన్’ అనేది రాయల్ బ్రదర్స్ నేతృత్వంలోని మొదటి అడుగు అని, ఇది మోటర్ సైక్లింగ్ ను ఒక అభిరుచిగా స్వీకరించడానికి మహిళలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సందర్బంగా ఆర్.బి సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అభిషేక్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ 5వ ఎడిషన్ ‘ఆర్.బి ఫర్ ఉమెన్’ని ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏబీసీ మేనేజింగ్ డైరెక్టర్ నకాటే హిరోషి మాట్లాడుతూ మహిళలకు సాధికారత కల్పించి వారి స్వాతంత్య్రాన్ని పెంపొందించడం ఎంబిఎస్ఐలో తమ మిషన్ ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. ఎంబిఎస్ఐ ప్రాజెక్ట్ హెడ్ గ్రిష హసీజ మాట్లాడుతు ఎక్కువ మంది మహిళలు ఉపాధి అవకాశాలను పొందేందుకు భారత దేశం అంతటా ఉన్న తమ భాగస్వాములందరితో కలిసి పని చేస్తామన్నారు.
మహిళలకు బైక్ డ్రైవింగ్ శిక్షణ ఇచ్చిన ప్రొఫెషనల్ ట్రైనర్లు





