మహాలయ అమావాస్య, తేరి శక్తి పీఠాలకు ప్రత్యేక రైళ్లు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : భారతీయ రైల్వే ‘ఉలా రైల్’ అత్యంత విజయవంతమైన భారత్ గౌరవ్ రైల్ పథకం కింద మహాలయ అమావాస్యకు, తీరి శక్తి పీఠ యాత్రలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ట్రావెల్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాలయ అమావాస్య ప్రత్యేక రైల్ ప్రయాగ, వారణాసి, గయ అయోధ్య, హరిద్వార్, ఢిల్లీ, మధుర, ఆధారాల మీదుగా నడవనుందన్నారు. అక్టోబర్ 10 వ తేదీన ఇది బయలదేరనుందన్నారు. దారి పొడవునా యాత్ర విశేషాలను వివరించేందుకు పీఏ సిస్టమ్స్, సీసీటీవీ కెమెరాలు, కోచ్ సెక్యూరిటీ, టూర్ మేనేజర్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, హెూటల్లు, సందర్శనా, రవాణా సదుపాయాలు కలవన్నారు. మూడు పుటలా దక్షిణ భారత భోజనం సహా వివిధ రకాల సౌకర్యాలను కలిగి ఉందన్నారు. మహాలయ అమావాస్య యాతకులు ఎల్టీసీ/ఎల్ఎఫ్సీ సౌకర్యాన్ని కూడా పొందవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 7876101010 లో సంప్రదించాలని కోరారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి www.railtourism.com ని సందర్శించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *