వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: జాతిపిత మహత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. సోమవారం మాహత్మాగాంధీ 154 వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో గాంధీ చిత్ర పటానికి అయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యగ్రహమే అయుధంగా అహింస, శాంతి మార్గములో దేశానికి స్వాతంత్య్ర సముపార్జ చేసిన మహానీయుడు మహాత్మగాంధీ అని కొనియాడారు. వారు చూపిన మార్గములో ప్రతి ఒక్కరు పయణించి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ ఓ అమరేందర్, మెప్మా పిడి రవి కుమార్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి





