మహాత్మా గాంధీ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్02:  జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ  జయంతిని పురస్కరించుకుని జిల్లా ప్రజా పరిషత్  ఆవరణలో గల   మహాత్మా గాంధీ విగ్రహానికి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని,వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు.జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ యువత మహాత్మా గాంధీ చూపిన శాంతియుత మార్గంలో నడవాలన్నారు. భారత దేశ స్వాతంత్రం కొరకు అహింస, శాంతియుత మార్గంలో పోరాడిన గాంధీజీ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డిప్యూటీ సీఈఓ, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *