తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: మహాత్మ జ్యోతిబా పూలే జాతీయ అవార్డు-2023 సంవత్సరమునకు గాను తాండూరు పట్టణానికి చెందిన జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ వారు ప్రకటించారు. ఈ అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ నల్ల రాధాకృష్ణ గారు అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాదులోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమి ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలియజేశారు,.అందులో భాగంగా గత 30 సంవత్సరాలకు పైగా విద్యార్థి దశ నుండి నేటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం వారి అభివృద్ధి ఆకాంక్షించి నిరంతరం పోరాడుతూ ఎన్నో ఉద్యమాలను తీసుకొని అధికారులను ప్రభుత్వాన్ని ఎదిరించి విద్యార్థుల కులవృత్తుల పక్షాన నిలబడి పోరాడుతున్న రాజ్ కుమార్ ను ప్రతిష్టాత్మమైన మహాత్మ జ్యోతిబా పూలే జాతీయ అవార్డుకు సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని అన్నారు.అక్టోబర్ 15వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా బహుజన రైటర్స్ 4వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా జ్యోతిబాపూలే జాతీయ అవార్డును రాజ్ కుమార్ కు అందజేయనున్నట్లు తెలియజేశారు. ఆల్ ఇండియా లోనే 27 రాష్ట్రాల నుండి సుమారుగా 1000 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్‌కు హాజరవుతారని తెలియజేశారు.ఈ అవార్డు ఆహ్వానపత్ర కార్యక్రమంలో బహుజన సాహితి అకాడమీ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణతోపాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎం గౌతమ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఎరన్ పల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




