తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యే పల్లె రోహిత్ రెడ్డికి పట్టం కట్టి పట్టణాన్ని సమస్యలు లేని తాండూర్ గా తీర్చిదిద్దుకుందామని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాండూరు మున్సిపల్ 8వ వార్డ్ లో వైస్ చైర్మన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ వీణా శ్రీనివాస్ చారి, ఫ్లోర్ లీడర్ శోభా రాణి, కౌన్సిలర్ లు వెంకన్న గౌడ్, సంగీతా ఠాకుర్, అశ్విని, నాయకులు జావిధ్, అనిత తదితరులతో కలిసి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి ఇంటికి వెళ్లి బీ అర్ ఎస్ మానిఫెస్టో వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మళ్ళీ ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డికి కి మళ్ళీ పట్టం కట్టి సమస్యలు లేని తాండూరు గా తీర్చిదద్దుకుందామని అన్నారు. బీ అర్ ఎస్ పార్టీ తోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చిత్త శుద్ధితో పని చేస్తున్నారన్నారు. తాండూరు కు అత్యధిక నిధులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి వృధా చేసుకోవద్దని కోరారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
మళ్లీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కే పట్టం కట్టండి





