వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల అభివృద్ధికి బాటలు వేశారని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి ప్రగతి పథంలో ప్రయాణిద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ మండలం పరిధిలోని పులుమద్ది, ఎర్రవల్లి, నారాయణపూర్, అత్త్వెళ్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ కు గ్రామాలలో బోనాలతో స్వాగతం పలికి ఎడ్లబండ్లపై ఊరేగిస్తూ ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ మళ్ళీ గెలిచాక తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద గృహిణి మహిళలకు 3000 పెన్షన్ అందించే మరో నూతన పథకానికి బిఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందన్నారు. మాజీల హయాంలో ఉన్న మండలానికో మధ్యవర్తి వ్యవస్థను మటుమాయం చేశాం అన్నారు. నేరుగా ప్రజలకే అందుబాటులో ఉన్నాం అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దడం జరిగిందని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. నారాయణపూర్ గ్రామానికి చెందిన బిజెపి నాయకులు తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరెడ్డి యూసూఫ్, చింతలబొగుడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ రత్నయ్య, నాయకులు సాయిలు, గోపాల్, శ్రీనివాస్, సతీష్ శేఖర్ వారి అనుచరులు 30 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మల్లొక్కసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేసుకుందాం




