మరోసారి గెలిపించండి సేవకుడిగా ఉంటా

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్‌ 14 : చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు తనను మరోమారు ఆశీర్వదిస్తే అభివృద్ధి కొనసాగిస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.మంగళవారం చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల, నవలయపల్లి,వెంకన్నగూడ, హస్తేపూర్‌,అంతారం,కుమ్మెర,మల్కాపూర్‌ గ్రామాల్లో జోరుగా బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎన్నికల ప్రచార వాహనంపై రోడ్‌ షోలో మాట్లాడుతూ…గతంలో పాలించిన కాంగ్రెస్ అభివృద్ధి చేసిందేమీ లేదని,బీఆర్‌ఎస్ ప్రభుత్వం,సీఎం హయాంలో రాష్ర్టం అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. ఎన్నికలు ఒచ్చినప్పుడే కాంగ్రెస్,బీజేపీ నాయకులకు ప్రజలు గుర్తుకువస్తారని,వారి కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని,మోసపోతే గోస పడుతామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇవ్వని హామీలను సైతం నెరవేర్చి ప్రజల సంక్షేమ ప్రభుత్వంగా ముందుకు సాగుతున్నదన్నారు.రాష్ట్రంలో రైతు బంధు,రైతు బీమా,కల్యాణ లక్ష్మి,షాదీముబారక్‌,దళిత బంధు, బీసీ బంధు తదితర పథకాలు ఇక ముందు కూడా కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎం చేయాలన్నారు.మరింత అభివృద్ధికి మరోసారి ఆశీర్వదిస్తే మీకు సేవకుడిగా పని చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్‌ పట్లొళ్ల కృష్ణారెడ్డి,ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి,ఆరు గ్రామాల సర్పంచ్‌లు గాయత్రిగోపాలకృష్ణ, సులోచనాఅంజన్‌గౌడ్‌, విజయలక్ష్మీనర్సింలు, వెంకటయ్య,భానుతేజ,శేరి శివారెడ్డి,వైస్ ఎంపీపీ శివ ప్రసాద్‌,వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మిట్ట వెంకట రంగారెడ్డి,వైస్ చైర్మన్‌ నర్సింలు,బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌,మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌,బీఆర్‌ఎస్ సీనియర్‌ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి,మార్కెట్‌ కమిటీ మాజీ వైస్ చైర్మన్‌ మాణిక్యరెడ్డి,బీఆర్‌ఎస్ మండల బీసీ సెల్‌ అధ్యక్షుడు ఎదిరె రాములు,మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శివనీల చింటు,ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి,బీఆర్‌ఎస్ మండల యూత్‌ అధ్యక్షుడు శేఖర్‌,రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జు రెడ్డి,బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు నరేందర్‌ గౌడ్‌,హన్మంత్‌ రెడ్డి, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ యాదగిరి,మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు ఫయాస్,నరేందర్‌, బీఆర్‌ఎస్ నాయకులు మద్దెల జంగయ్య,శేరి రాజు,వంగ శ్రీధర్‌రెడ్డి,సాయినాథ్‌,పెంటారెడ్డి,బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *