కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 21 : కందుకూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం వాడి వేడిగా కాకుండా మమ అనిపించారు.మండల పరిషత్ అధ్యక్షురాలు మంద జ్యోతి పాండు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి కేవలం 7 మంది ఎంపీటీసీలు, ముగ్గురు సర్పంచ్ లు,పలు శాఖల అధికారులు కొందరు మాత్రమే హాజరై సమావేశాన్ని మమ అనిపించారు. మొదటగా వ్యవసాయ కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది అనంతరం విద్యుత్తు,ప్రాథమిక విద్య,ప్రాథమిక ఆరోగ్య, పశుసంవర్ధక శాఖ,మహిళా శిశు సంక్షేమ శాఖ,డిఆర్డిఏ,మహాత్మా గాంధీ జాతి ఉపాధి, సామాజిక అడవుల పెంపకం,ఉద్యానవన కార్యక్రమాల పట్ల చర్చ జరిగింది. సమావేశంలో అధికారులు తూతు మంత్రంగా ఎజెండాలో ఉన్న అంశాలను చదివి మమ అనిపించారు.మండలంలో 35 గ్రామ పంచాయతీలు ఉండగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు 32 మంది గైర్హాజరయ్యారు.మరో ఏడు మంది ఎంపీటీసీలు కూడా గైరాజరయ్యారు. పూర్తిస్థాయిలో ప్రజా ప్రతినిధులు లేక సమావేశం వెలవెల పోయింది.సమావేశంలో లేమూరు,ముచ్చర్ల ఎంపీటీసీలు మాత్రమే అధికారులను కొంతమేర ప్రశ్నలు అడగడం జరిగింది.ఈ క్రమంలో పెద్దమ్మ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ సుమన్ నాయక్ మండల సమావేశంలో తాము అడిగిన సమస్యలపై నేటికీ తీర్చలేదని ఆయన అసహనం వ్యక్తం చేయగా ఎంపీడీవో వెంకట్ రాములు కల్పించుకుని పెద్దమ్మ తండాలో ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి జరగలేదని ఎలా అనుకుంటారని తెలపడంతో నేటికీ తాను 300 మంది విద్యార్థులకు బస్ పాసుల కోసం డోనరుగా నిలిచి వారికి పాసులు అందించడం జరిగిందని అప్పటినుండి తమ గ్రామానికి బస్సులు వస్తున్నాయని ఆయన సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీడీవో కల్పించుకొని మీగ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తారు కదా మీ గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశారా అని అడగడంతో తమ గ్రామంలో పూర్తి అభివృద్ధి పనులు తాము చేయడం పట్లనే గ్రామ ప్రజలు సంతోషంగా ఉన్నారని మమ్మల్ని ఎవరు ప్రశ్నించ లేక పోతున్నారని ఆయన తెలిపారు.లేమూరు ఫారెస్ట్ మండలంలో అతిపెద్దదని తమ గ్రామం పేరు ఎందుకు ఎత్తడం లేదని లేమూరు ఎంపీటీసీ యాదయ్య ఫారెస్ట్ అధికారిని అడగగా గతంలో జరిగిన అవి కాకుండా నూతనంగా వచ్చిన వాటిలో నర్సరీలు మొక్కలు నాటడం తడితర కార్యక్రమాలు గుమ్మడవెల్లి,మాదాపూర్,పులిమామి
మమ అనిపించిన కందుకూరు మండల సమావేశం





