- విరు మోదీని టార్గెట్ చేసే గొప్పోళ్లా
- లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నది ఎవరు…చేయమని తెలంగాణ ప్రజలు చెప్పారా
- ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలన చేసిందెవరు
- కవిత, కెటిఆర్లపై విరుచుకు పడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9 : మద్యం కేసు బయట పడగానే మహిళా రిజర్వేషన్లు గుర్తొచ్చాయా అని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి బిఆర్ఎస్ ఎంఎల్సి కవితను నిలదీశారు. తెలంగాణలో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలించిన వి•కు..రిజర్వేషన్ల గురించి అడిగే హక్కు ఉందా అని ధ్వజమెత్తారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వి•రు దిల్లీకి వెళ్లి అక్రమ మద్యం వ్యాపారం చేయాలని తెలంగాణ సమాజం చెప్పిందా అని ఆయన ప్రశ్నించారు. నోరు తెరిస్తే అబద్ధాలు..నిజం మాట్లాడమే తెలియదు వాళ్లకు అంటూ మంత్రి కెటిఆర్, ఎంఎల్సి కవితలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. వాళ్లకు వాళ్లు గొప్పోళ్లుగా ఊహించుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే పని చేసిన కవిత.. రాజకీయ వేధింపులు అని మాట్లాడటం సిగ్గు చేటన్నారు. గురువారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ..ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
అన్నా చెల్లెళ్లు మోదీని టార్గెట్ చేసేంత గొప్ప కుటుంబం, మనుషులయితే కాదంటూ చురకలు అంటించారు. తమకుతాముగా కేసులో ఇరుక్కుని బీజేపీపై అభాండాలు వేస్తున్నారని..ఫోన్లు పగలగొట్టింది ఎవరని ప్రశ్నించారు. దిల్లీ లిక్కర్ పాలసీలో ఎవరు తలదూర్చారు..ఎవరు మార్చారు..ఎవరు స్పెషల్ ఫ్లయిట్స్లో వెళ్లారు..ఎవరు డబ్బులు సంపాదించారు అంటూ ఏకిపారేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి ఒక చట్టం, సామాన్యులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మద్యం వ్యాపారం చేసి అక్రమంగా డబ్బులు సంపాదించండని తెలంగాణ సమాజం ఏమైన కల్వకుంట్ల కుటుంబానికి చెప్పిందా..? వి•రు దిల్లీకి వెళ్లండి అక్కడ ఆప్ పార్టీతో కలిసి అక్రమంగా మద్యం వ్యాపారం చేయండని తెలంగాణ ఆడబిడ్డలు వి•కు చెప్పారా..? ఈ కుటంబం చేసిన పనితో తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పండింది. లిక్కర్ స్కామ్లో మహిళ ఉండటం ఎప్పుడూ చూడలేదన్నారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు.
కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న సంపాదన సరిపోదని, బయటి రాష్ట్రాల్లో వ్యాపారాలు చేయమని వి•కు తెలంగాణ ప్రజలు చెప్పారా..? వ్యాపారంలో లాభాల్లో తెలంగాణ ప్రజలకు, మహిళలకు వాటాలు ఏమైనా ఇచ్చారా..? మరి కేసు అవ్వగానే తెలంగాణ ప్రజల పేరు చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వ్యాపారంలో తప్పులు చేయనట్లయితే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఎందుకు లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్స్ ధ్వంసం చేశారని సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నారు. అబద్దాలు ఆడటంలో బీఆర్ఎస్ నేతల్ని మించిన వాళ్లు లేరు. మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఉందా..? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మొదటి ఐదు సంవత్సరాలు అధికారం వెలగబెట్టిన కేసీఆర్? ఆయన పార్టీ ఒక్క మహిళ లేకుండా పాలన చేసిన వారికి మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వి• మిత్ర పక్షం ఎంఐఎంను ముందు ఒప్పించారా..? అంతెందుకు వి•కు మిత్ర పక్షంగా ఉన్న ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీలు గతంలో పార్లమెంటులో అడ్డుకున్న విషయం మరిచిపోయారా అంటూ విమర్శించారు.
ఇవాళ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు కాబట్టే.. ఆ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు రిజర్వేషన్ నాటకం మొదలు పెట్టారు. సానుభూతి కోసం చేస్తున్న డ్రామా మొదలు పెట్టారంటూ ఎద్దేవ చేశారు. ఇక దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం వెనుక కక్ష సాధింపులు లేవనారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, అధికారంలోకి వొచ్చిన వెంటనే అందరిపై కక్ష సాధింపులకు దిగిన కల్వకుంట్ల కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి అందరూ అలాగే చేస్తున్నట్టు అనిపిస్తున్నారని విమర్శించారు.




