బహుమతాల మనుగడలు
బహుజాతుల జాతరలు
బహుభాష వాడుకల వేడుకలు
సుమధుర సమ్మిళితత్వాలు
సుందర సాంస్కృతిక వైవిధ్యాలు
నాటి భరతజాతి భవ్య వెలుగులు
అంతరిస్తున్నాయా..
నేడు సహజీవన సౌరభాలు
రెక్కలు తెగుతున్న శాంతి కపోతాలు
మతాల నడుమ ముళ్ల కంచెలు
ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదాలు
గాల్లో దీపాలైన పరమత సహనాలు
దిగజారుడు జాతీయవాదాలు
మతాల మంటల నెగడులు
కులాల కుళ్లు కొర్రాసు కుంపట్లు !

దేశ పునాదులకు..
విస్పొటన వీరంగపు బీటలు
పలుచబడుతున్న ఏకత్వ పోడకలు
ఇంకి పోతున్న భిన్నత్వ భావనలు
ఓట్ల యాలలో విభజవవాదాలకు..
పాలుపోసే దుర్రాజకీయ మాటలు
హద్దులు మీరుతున్న స్కంధారావాలు
పార్టీల అసహన మూకవీరంగాలు
పొంగిపొర్లుతున్న ఆరోపణల కంపులు
మతవిద్వేష అశ్లీల మురుగులు
భిన్నత్వంలో ఏకత్వానికే పంగణామాలు
దేశ సమైక్యత, సమగ్రతలకే..
పొడుస్తున్నారు నిలువెల్ల తూట్లు !

 – మధుపాళీ
కరీంనగర్‌, 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *