మణి దీపం

మహిళే కదిలింది
మహిమే చూపింది
మహిలోన ప్రగతికి
బాటే తానైనది

ధరణే ధన్యమయ్యింది
పుడమే పులకించింది
మీ పాదాల ప్రణమిల్లి
మీ ఘనతనే చాటింది

తొలికోడి కూత కన్నా
యల కోయిల పాట కన్నా
ముందే నిద్దుర లేచే
మహిళే కదరా మిన్నా

ఇలలో అందమైనది
కళకే కళ తెచ్చింది
వసుధకే ఒక వరమై
వసంతాలు జల్లినది

అబలలకు ఆలంబన
సబలలకు సమభావన
లభించాలి ప్రతి చోటా
అదే కదా మాతృ భావన

-గుండాల నరేంద్ర బాబు
(తెలుగు పరిశోధకులు
శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయం,
తిరుపతి, సెల్‌ :9493235992)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *