మందకృష్ణ మాదిగ ను కలిసిన అందెల

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 19: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ను  మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అందెల శ్రీ రాములు యాదవ్ మాట్లాడుతూ.. ఎస్సీ  వర్గీకరణ కోరుతూ.. అలంపూర్ చేపట్టిన పాదయాత్ర  గురువారం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం మల్లాపూర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా మల్లాపూర్ లోని కడారి బీరప్ప కన్వెన్షన్ హాల్ లో మంద కృష్ణ మాదిగ ను అందెల శ్రీ రాములు యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి ఎస్సీ వర్గీకరణకు తన మద్దతు తెలిపారు. అనంతరం అందెల శ్రీ రాములు యాదవ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కృష్ణన్న ఆశయం త్వరలో నెరవేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ మోర్చా నాయకులు గడ్డం వెంకటేష్, చిత్రం శ్రీను, బుడమల యాదగిరి, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *