సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 25 : సిద్దిపేట జిల్లా ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆశీస్సులు తీసుకున్నారు. మంగళవారం ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంత్రి హరీష్ రావును మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. పూల మొక్కను అందజేసిన రంగారెడ్డికి మంత్రి హరీష్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆశీర్వదించారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జగదేవ్ పూర్ మండల బిఆర్ఎస్ నాయకుడు దాచారం కనకయ్య తదితరులు ఉన్నారు.




