మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన యాదగిరి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 19: మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని  కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి ధర్మకర్తగా నూతనంగా నియమితులైన మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ శ్రీ సాయి కృపా నగర్ కాలనీ నివాసి మేకల యాదగిరి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి శనివారం మంత్రిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల బోకే అందజేసి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ గా నియమితులైన మేకల యాదగిరికి అభినందనలు తెలిపారు. ఆలయం అభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు. అనంతరం మేకల యాదగిరి మాట్లాడుతూ.. నా నియమానికి కృషి చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అందుకు సహకరించిన కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. మంత్రి ఆశీస్సులతో ఆలయం అభివృద్ధికి నావంతుగా కృషి చేస్తానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *