మంత్రి పొన్నం ప్రభాకర్ ను సన్మానించిన జాతీయ వడ్డెర సంఘం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా జాతీయ వడ్డెర సంఘం ప్రతినిధి బృందం శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు సోమవారం మంత్రి నివాసంలో జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల వెంకటేష్, కోశాధికారి బత్తుల లక్ష్మీకాంతయ్య, నాయకులు మధు, తిరుమలేశ్ తదితరులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *