తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి కి తాండూరు ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ శనివారం హైదరాబాద్లో రాష్ట్ర పౌర సమాచార గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి మహేందర్ రెడ్డి అనేక నిధులు తీసుకువచ్చి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. స్థానిక శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి మంత్రి మహేందర్ రెడ్డి సహకారంతో తాండూరు అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, కమల్పూర్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అనంతయ్య ముదిరాజ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.



