హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : తమ ప్లాట్లను ఆక్రమించి వేధిస్తున్న మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి కె.ప్రేమ్ సాగర్ రావును ఓడించి బుద్ది చెప్పాలని ఉద్యోగ, దళిత బహుజన ప్లాట్ ఓనర్స్ సొసైటీ సెక్రటరీ జి.గోపాల్ రావు మంచిర్యాల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యవర్తుల ద్వారా ఒక ప్లాట్ కు రూ.10 లక్షల చొప్పిన ఇస్తానని తనకు మాత్రమే ప్లాట్లు అమ్మాలని వేదిస్తున్నాడని ఆరోపించారు. బలవంతంగా ప్లాట్లు అమ్మాలని రౌడీలను పెట్టి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 1982లో మేడ్చెల్, మల్కాజిగిరి జిల్లాల సరిహద్దు ల్లోని కాప్రా రెవిన్యూడివిజన్ పరిధిలో గల వంపుగూడా గ్రామంలోని 62 ఏకరాల్లో భూముల్లో వేసిన వెంచర్లో ప్లాట్స్ కొనుగోలు చేశామని తెలిపారు. ఈ భూముల సర్వే నెంలు వరుసగా 639,643, 644, 647, 648, 654 ఉన్నామని వెల్లడించారు. ప్లాట్లలో తాము కట్టుకున్న నిర్మాణాలను సైతం తన అనుచరులతో కూల్చివేశాడని ఆగ్రహించారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందంటూ తమ ప్లాట్ల వద్దకు రావొద్దని పోలీసులు సైతం ప్రేమ్ సాగర్ రావుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. వృద్ధులమైన తమ ప్లాట్లు తమకు ఇప్పించకపోతే తమకు మరణమే శరణం అని అధికారులకు స్పష్టం చేశారు. రెవిన్యూ అధికారులు సర్వేచేసి తమ భూమలుగా తేల్చారని చెప్పారు. హైకోర్టు సైతం తమకే అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అన్నారు.
మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావును ఓడించాలి





