మంగళపల్లి – చెన్నారం వాగు పై బ్రిడ్జి నిర్మించాలని మంత్రికి వినతి 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 :   కల్వకుర్తి ఎమ్మెల్యే జి. జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ సచివాలయంలో కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరుతూ ఆయా శాఖల మంత్రులు కలిసినట్లు ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి తెలిపారు. తాలూకాలోనీ వివిధ పనుల పెండింగ్ ఫైళ్లను పరిశీలించి ఆయా శాఖల మంత్రులను కలిసి  ప్రోసిడింగ్స్ అందించి నిధులు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. ఆమనగల్లు మండలానికి సంబంధించిన మంగళపల్లి చెన్నారం వాగు పై బ్రిడ్జి నిర్మాణం కోసం అతి త్వరలో ప్రోసిడింగ్ అందజేయడం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రులను కలిసిన వారిలో కర్కల్ పహాడు ఎంపీటీసీ లచ్చి రామ్ నాయక్, పలు మండలలా నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *