భీకర భూకంపాల తాకిడితో
తుర్కియో సిరియా దేశాలు
అల్లకల్లోలం అవుతున్నాయ్
తుర్కియో సిరియా దేశాలు
అల్లకల్లోలం అవుతున్నాయ్
ప్రకృతి ఉత్పాత తీవ్రతకు
ప్రాణాలు నేల రాళ్తున్నాయ్
ఎటు వైపు చూసినా..
గుట్టలుగా పోగైన శవాలు
తెగిపడిన దేహ అంగాలు
కుప్ప కూలిన భవనాలతో
వల్లకాటిని తలపిస్తున్నాయ్
శిధిలాల కింద చిక్కిన
క్షతగాత్రుల అర్థనాదాలు
గుండెలను పిండేస్తున్నాయ్
వందల కొద్ది ప్రకంపనలతో
జీవితాలు దగ్దమౌతున్నాయ్
లెక్క మించిన మరణాలతో
కుటుంబాలు కూళ్తున్నాయ్
బాధితులతో నిండుకున్న
హాస్పిటల్స్ దుఃఖిస్తున్నాయ్
ఇది విషాదకర సమయం
తప్పక స్పందించే తరుణం
బాసటగా నిలిచే సందర్భం
అందుకే మానవతులుగా
మరణించిన ధీనజనులకు
ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిద్దాం
క్షతగాత్రులు శీఘ్రముగా
కోలుకోవాలని ఆకాంక్షిద్దాం
బాధిత దేశాలు మరలా
పునరుజ్జీవం పొందాలని
త్రికరణశుద్ధిగా ప్రార్థిద్దాం
మానవతను చాటుదాం
(టర్కీ సిరియా దేశాలకు సానుభూతి ప్రకటిస్తూ..)
– కోడిగూటి తిరుపతి, 9573929493




