అంబులెన్స్ కి అద్దె చెల్లించలేక భర్త భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని కొరపుట్ జిల్లా వరిగుమ్మ సమితిలో శనివారం చోటుచేసుకుంది .పూర్ణ గూడెం పంచాయితీ ,కుమిలి గ్రామంలోని పుట్టింట్లో వివాహిత కరుణ అమృత్యో (30) అనే గిరిజన మహిళ అనారోగ్యంతో మృతి చెందింది.అయితే వారి సాంప్రదాయం ప్రకారం అంతేక్రియలు అత్తగారి ఊరైన నవరంగపూర్ జిల్లాలోని నందాహుండీ సమితి జగన్నాథ్ పూర్ పంచాయతీ పుష్పంగాలోని నిర్వహించాలని పెద్దలు నిర్ణయించారు.
అయితే మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్లడానికి ప్రభుత్వం అంబులెన్స్ లభించలేదు ,కాగా ప్రైవేట్ అంబులెన్స్ లో తరలించడానికి ఆర్థిక పరిస్థితి సైతం సహకరించక పరిస్థితి ఏర్పడింది.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే