భారీగా కలెక్టర్ల బదిలీలు

పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దిరోజులకు తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్నవారిని మార్చింది. అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్దఎత్తున మార్పులు చేసింది. వివిధ జిల్లాల కలెక్టర్లను బదిలే చేస్తూ కొత్తవారిని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు ఇలావున్నాయి. ఖమ్మం: ముజామిల్‌ ఖాన్‌, నాగర్‌కర్నూల్‌: సంతోష్‌, భూపాలపల్లి: రాహుల్‌శర్మ, కరీంనగర్‌: అనురాగ్‌ జయంతి, పెద్దపల్లి: కోయ శ్రీహర్ష, జగిత్యాల: సత్యప్రసాద్‌, మంచిర్యాల: కుమార్‌ దీపక్‌,  మహబూబ్‌నగర్‌: విజయేంద్ర, హనుమకొండ: ప్రావీణ్య, నారాయణపేట్‌: సిక్తా పట్నాయక్‌, సిరిసిల్ల: సందీప్‌కుమార్‌ రaా,  భదాద్రి కొత్తగూడెం: జితేష్‌ వి పాటిల్‌, వికారాబాద్‌: ప్రతీక్‌ జైన్‌, కామారెడ్డి: ఆశిష్‌ సంగ్వాన్‌, నల్గొండ: నారాయణరెడ్డి, వనపర్తి: ఆదర్శ్‌ సురభి, సూర్యాపేట కలెక్టర్‌: తేజస్‌ నందలాల్‌ పవార్‌, వరంగల్‌: సత్య శారదాదేవి, ములుగు: దివాకరా, నిర్మల్‌: అభిలాష అభినవ్‌ ఉన్నారు. ఈ బదిలీల్లో పలువురు కలెక్టర్లను మార్చారు.  సుమారుగా 20 జిల్లాలకు కలెక్టర్లను బదిలీ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ముజామిల్‌ ఖాన్‌ను ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా, మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ను నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌గా, ట్రాన్స్‌కో జేఎండీ సందీప్‌ కుమార్‌ రaాను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా, అనురాగ్‌ జయంతిని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్గా, నిర్మల్‌ కలెక్టర్‌ ఆశీష్‌ సంగ్వాన్‌ను కామారెడ్డిజిల్లా కలెక్టర్‌గా, జితేష్‌ వి పాటిల్‌ను భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా, రాహుల్‌ శర్మను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా, హన్మకొండ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా, పీ ప్రావీణ్యను వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ నుంచి హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా, సత్యప్రసాద్‌ను ఖమ్మం అదనపు కలెక్టర్‌ నుంచి జగిత్యాల కలెక్టర్‌గా బదిలీ చేశారు. కోయ శ్రీహర్షను పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా, విజయేంద్ర బోయిని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా, కుమార్‌ దీపక్‌ను మంచిర్యాల కలెక్టర్‌గా, ప్రతీక్‌ జైన్‌ను వికారాబాద్‌ కలెక్టర్‌గా, నారాయణరెడ్డి వికారాబాద్‌ కలెక్టర్‌గా, ఆదర్శ సురభిని వనపర్తి జిల్లా కలెక్టర్‌గా, తేజస్‌ నంద్‌లాల్‌ను సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా, సత్య శారదాదేవిని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, దివాకర్‌ను ములుగు జిల్లా కలెక్టర్‌గా, అభిలాష అభినవ్‌ను నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *