భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థం

  • ఎప్పుడూ పడనంతగా భారీ వర్షంతోనే తీవ్రనష్టం
  • ములుగు జిల్లా కొండాయి గ్రామ వరదల్లో 8 మంది మృతి…అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మంత్రి
  • మోరంచలో ఎమ్మెల్యే పర్యటన…బాధితులకు ఆదుకుంటామని హావి•
  • నిజామాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు….శ్రీరాంసాగర్‌లో 32 గేట్లు ఎత్తి నీటి విడుదల
  • నిండుకుండల్లా జంట జలాశయాలు
  • మున్నేరులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు వొచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌…అభినందించిన మంత్రి పువ్వాడ
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : రాష్ట్ర వ్యాప్తంగా రెండు, మూడు రోజులుగా కురుస్త్ను భారీ వర్షాలకు జనజీవనం స్థంభిచిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పలు ప్రాంతాల్లో మనుషులు గల్లంతయ్యారు. శుక్రవారం వర్షం కొంత తెరిపినివ్వడంతో ఇప్పటి వరకు జలదిగ్బంధంలో చిక్కుకుని మునిగిపోయిన ఇండ్లు తేలాయి. పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడ చూసినా రోడ్లు ధ్వంసమైపోయాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారులు కొట్టుకునిపోయాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఇతర శాఖల సహాయ సహకారాలతో ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఇక సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రత్యేక హెలికాప్టర్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకుని రావడంతో పాటు వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలో జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో కొండాయి, మల్యాల గ్రామాలను వాగు ముంచెత్తింది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వరదలో కొట్టుకుపోయి గుర్తుతెలియని యాచకుడి మృత దేహం కరెంటు తీగలకు వేలాడుతూ కనిపించింది. జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్థంభిచిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కాగా, ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో గురువారం వరదలో గల్లంతైన ఎనిమిది మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం గల్లంతైన వ్యక్తులలో నాలుగు మృతదేహాలు లభించగా మధ్యాహ్నం వరకు మరో నాలుగు మృతదేహాలు లభించినట్లు సమాచారం. దీంతో గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లాలో తొమ్మిది మంది వ్యక్తులు వరదల కారణంగా మృతి చెందారు. వర్షం కొంత తెరిపి నివ్వడంతో జలదిగ్భందంలో చిక్కుకుని మునిగిపోయిన ఇండ్లు తేలాయి. గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్లు ధ్వంసమైపోయాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదిలావుంటే రాష్ట్రంలో ములుగు జిల్లాలో పడినంత వర్షం చరిత్రలో ఎప్పుడు చూడలేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అం‌డ్‌బీ గెస్ట్ ‌హౌస్‌లో ములుగు జిల్లా ఇన్‌చార్జి ప్రత్యేక అధికారి యస్‌. ‌కృష్ణాదిత్య,  జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి ప్రత్యేక అధికారి గౌతమ్‌ ‌పొట్రూ, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి వి•డియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 70 సెంటీవి•టర్లు పైగా భారీ వర్షపాతం నమోదు కావడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. భారీ వర్షాల వల్ల ఇప్పటివరకు జిల్లాలో 8 మంది మృత్యు వాతపడ్డారని వివరించారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, అన్ని విధాలుగా నష్టపోయిన వారికి రూ. 25 వేలు తక్షణమే అందిస్తామని అన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ ‌కోటి రూపాయలను మంజూరు చేశారని తెలిపారు.
మోరంచలో ఎమ్మెల్యే పర్యటన…బాధితులకు ఆదుకుంటామని హావి•
జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి  ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో మోరంచ వాగు ఉప్పొంగింది. దానికి గణప సముద్రం వరద తోడటంతో మోరంచ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఊరిని మొత్తం వరద చుట్టుముట్టింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఇండ్లు మొత్తం నీటమునిగాయి. ఇండ్లపైకి చేరుకున్న గ్రామప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తెల్లవార్లు గడిపారు. ప్రభుత్వం రంగంలోకి దిగింది. హెలికాప్టర్లు, బోట్లతో వాగులో చిక్కుకుపోయినవారిని రక్షించారు. రోజు గడిచింది. మోరంచ వాగు శాంతించింది.
జలదిగ్భందంలో చిక్కుకుని మునిగిపోయిన ఇండ్లు తేలాయి. గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్లు ధ్వంసమైపోయాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారి కొట్టుకుపోయింది. అయితే శుక్రవారం ఉదయానే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి , జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మోరంచపల్లికి చేరుకున్నారు. దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. ఇంటింటికి తిరిగి పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. బాధితుల క్షేమసమాచారాలు అడిగితెలుసుకున్నారు. పలువురు వరద ఉధృతిని గురించి గండ్ర దంపతులకు వివరించారు. కాగా, బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నిజామాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు….శ్రీరాంసాగర్‌లో 32 గేట్లు ఎత్తి నీటి విడుదల
రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి ముఖద్వారమైన నిజామాబాద్‌ ‌జిల్లా కందకుర్తి వద్ద వరద ఉగ్రరూపంలో ప్రవహిస్తున్నది. ఎగువ మహారాష్ట్ర నుంచి 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగు తుండడంతో పాటు నిజాంసాగర్‌ ‌గేట్లు ఎత్తడంతో మంజీరా నది ద్వారా వరద భారీగా త్రివేణి సంగమం వద్ద పోటెత్తుతున్నది. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని గోదావరి నదిపై నిర్మించిన హై లెవల్‌ ‌వంతెనకు తాకుతూ గోదారమ్మ ప్రవహిస్తున్నది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్‌ ‌స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని అత్యవసర సమయాల్లో టోల్‌‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ ‌చేసి సహాయం పొందవచ్చన్నారు. ఎగువన వర్షాలతో నిజామాబాద్‌ ‌జిల్లాలోని శ్రీరాంసాగర్‌  ‌ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి ఎస్‌ఆర్‌ఎస్పీకి భారీగా వరదనీరు వొచ్చిచేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,08,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. దీంతో అధికారులు 32 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
నిండుకుండల్లా జంట జలాశయాలు
హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుకుంటుంది. ఉస్మాన్‌ ‌సాగర్‌ ఇన్‌ ‌ఫ్లో 1600 క్యూసెక్కులకు చేరుకుంటుంది. ఉస్మాన్‌ ‌సాగర్‌ ‌ప్రస్తుత  నీటి  మట్టం 1787.95 అడుగులకు చేరుకుంది. ఉస్మాన్‌  ‌సాగర్‌ ‌పూర్తిస్థాయి నీటి  మట్టం 1790 అడుగులకు చేరుకుంది. ఉస్మాన్‌ ‌సాగర్‌ 4 ‌గేట్లు  ఒక్క అడుగు మేర ఎత్తి 852 క్యూసెక్కుల నీటిని అధికారులు మూసిలోకి వదిలారు. హిమాయత్‌ ‌సాగర్‌కు 3000 క్యూసెక్కుల ఇన్‌ ‌ఫ్లో వొచ్చి చేరుకుంటుంది. హిమాయత్‌ ‌సాగర్‌  ‌ప్రస్తుత  నీటిమట్టం 1762.20 అడుగులకు చేరుకుంది. హిమాయత్‌  ‌సాగర్‌ ‌పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు చేరుకుంది. హిమాయత్‌ ‌సాగర్‌ ‌రెండు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూసెక్కుల నీటిని అధికారులు మూసిలోకి విడుదల చేశారు.
మున్నేరులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు వొచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌…అభినందించిన మంత్రి పువ్వాడ
వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందం రక్షించింది. మున్నేరు వాగు ఉధృతితో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించారు. దీంతో మంత్రి పువ్వాడ అజయ్‌ ‌శుక్రవారం ఖమ్మంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందంతో ప్రెస్‌ ‌వి•ట్‌ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ సన్మానించారు. మున్నేరు చరిత్రలో ఇంత వరద ఉధృతి చూసింది ఇదే ప్రథమం అని అన్నారు. సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వొచ్చిందని, ఎంత వేగంగా వొచ్చిందో.. అంతే వేగంగా వెళ్ళిందన్నారు. ఎవరు ఊహించని విధంగా వరద ఉధృతి వొచ్చిందన్నారు. 26 అడుగులు దాటి వరద ఉదృతి ఎప్పుడు రాలేదు కానీ ఈ సారి 30 అడుగులపైన వరద ఉధృతి వొచ్చిందన్నారు. కొత్తగూడెం కోసం వెళ్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాన్ని ఖమ్మంకు తీసుకుని వొచ్చామని మంత్రి పువ్వాడ తెలిపారు. వారు వొచ్చే సమయానికి చీకటి పడిందని ఆ సమయంలో కాపాడతారో లేదో అనుకున్నాం.. కానీ వారు అందరినీ రక్షించారని కొనియాడారు. 6 నెలల పాప నుంచి వృద్ధుల వరకు అందరినీ రక్షించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *