– బంగ్లా వస్త్రవ్యాపారుల డిమాండ్
ఢాకా, జనవరి 26: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారత్-బంగ్లాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తూ వచ్చాయి. మరోవైపు ఆ దేశంలోని హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా అక్కడి వస్త్ర పరిశ్రమ వర్గాలు మరో డిమాండ్‌ను తెర పైకి తీసుకువచ్చాయి. ఇప్పటివరకు భారత నూలుకు బంగ్లాదేశ్‌లో ఉన్న డ్యూటీ-ఫ్రీ సౌకర్యం తొలగించాలని పట్టుబట్టాయి. లేదంటే ఫిబ్రవరి 1 నుంచి కర్మాగారాలు మూసివేస్తామని బంగ్లా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ మేరకు ఆ దేశ వాణిజ్యశాఖ నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు లేఖ అందినట్లు యూనస్ ప్రభుత్వం పేర్కొంది. జనవరి చివరి నాటికి భారత నూలుకు సుంకం లేని దిగుమతి సౌకర్యాన్ని ఉప సంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా అన్ని స్పిన్నింగ్ యూనిట్లలో కార్యకలాపాలు నిలిపేస్తామని దేశీయ మిల్లర్లు హెచ్చరించారు. చాలా ఏళ్లుగా సుంకం లేకుండా భారత్ నుంచి చౌకగా నూలును దిగుమతి చేసుకుంటుండడం వల్ల స్థానిక స్పిన్నింగ్ యూనిట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల దేశీయ వస్త్ర పరిశ్రమలో 12వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన అమ్ముడుపోని నిల్వలు మిగిలిపోయాయని తెలిపారు. 50కి పైగా వస్త్ర పరిశ్రమలు మూసేయడం వల్ల వేలాదిమంది కార్మికులు నిరుద్యోగులుగా మారారన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ వర్గాల డిమాండ్‌ను అక్కడి వస్త్ర ఎగుమతిదారుల సంఘం వ్యతిరేకిస్తోంది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న నూలుతో పోలిస్తే స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న నూలు ఖరీదైనదని ఎగుమతిదారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్లు, మెరుగైన నాణ్యత విషయాల్లో ప్రపంచ దేశాలు భారత్‌లో ఉత్పత్తి అయ్యే నూలుకు ప్రాముఖ్యత ఇస్తాయన్నారు. ఇప్పుడు భారత్‌కు ఉన్న డ్యూటీ-ఫ్రీ సదుపాయాన్ని నిలిపివేస్తే అక్కడి నుంచి ఎగుమతులు తగ్గుతాయన్నారు. దీనివల్ల ప్రపంచ దుస్తుల మార్కెట్‌లో పోటీని బంగ్లాదేశ్ ఎదుర్కోలేదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

