టీపిసిసి కార్యవర్గ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 7 : ఎఐసిసి నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర ఎంతో స్ఫూర్తినిచ్చిందని దేశ ప్రజల ఆశలు, నూతన భవిష్యత్తుకు వాగ్దానం చేసే విధంగా ఉందని టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశ ప్రజలను ఏకం చేయడం కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా 4000 కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర పాదయాత్ర ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏఐసిసి, టీపీసీసీ పిలుపు మేరకు కడ్తాల్ మండల కేంద్రంలోని కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీచ్య నాయక్ ఆధ్వర్యంలో భారత్ జూడో సమ్మేళన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు మాట్లాడుతూ గత సంవత్సరం, సెప్టెంబర్ 7 మాకు గొప్ప రోజని మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చారిత్రాత్మకమైన భారత్ జోడో యాత్రను ప్రారంభించారని అన్నారు. ఇది మన దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని సుదీర్ఘమైన పాదయాత్ర అని కొనియాడారు. 4081 కిలోమీటర్లు, 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 75 జిల్లాలు, 76 లోక్‌సభ నియోజకవర్గాల్లో 136 రోజులపాటు నడిచిన రాహుల్ గాంధీ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారన్నారు. రాహుల్ గాంధీ ప్రజలకు, నాయకులకు తన పైన ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని రాష్ట్రాలను, ప్రాంతాలను, జాతులను, కులాలను, మతాలను, వివిధ రకాల వ్యక్తులను, సంస్థల్ని ఎందరినో కలుస్తూ మనం అంతా ఒక్కటే అని తెలియజేస్తూ నడిచారన్నారు. నఫ్రత్ చోడో భారత్ జూడో అనే నినాదంతో సాగిన యాత్ర. రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల మొండి వైఖరిని స్పష్టం చేస్తూ, ఈ యాత్ర స్పూర్తితో గ్రామ గ్రామాన తిరిగి కాంగ్రెస్ పార్టీ ను బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. భారత దేశ ప్రజలను ఏకం చేయాలనే ఆలోచనతో జోడో యాత్ర చేపట్టారని. రాహూల్ గాంధీ నాయకత్వంలో దేశంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పక వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అదికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీఖ్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు యాట నర్సింహా, రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ అలీ, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్, కొ ఆప్షన్ సభ్యులు జాంగీర్ బాబా, సర్పంచులు శంకర్, బాబోజీ, రామ్, సేవాదళ్ లక్ష్మయ్య, టౌన్ వర్కింగ్ అధ్యక్షుడు రాంచందర్ నాయక్, సీనియర్ నాయకులు వెంకటయ్య, యాదయ్య, జవహార్, శేఖర్, రామకృష్ణ, నరేందర్, శ్రీను, అజ్గార్ అలి, జంగయ్య, తిరుపతి రెడ్డి, శ్రీరాముల, జగన్, క్యామ రాజేష్, సెవ్య, యుత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హీరా సింగ్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు శాబ్బుద్దిన్, టౌన్ అధ్యక్షుడు భానుకిరణ్, శ్రీకాంత్, బోసు రవి, రాజేందర్ గౌడ్, గురిగళ్ళ రామకృష్ణ, తులసీ రామ్, మహేష్, రమేష్ నాయక్, విజయ్ రాథోడ్, ప్రవీణ్, టీల్లు, రంగా, వంశి, నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.




