సర్వాంగ సుందరంగా ముస్తాబు..
రాములోరి పెళ్లికి సర్వం సిద్ధం
17న శ్రీసీతారాముల కల్యాణం
18న మహా పట్టాభిషేకం
భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : భదాద్రికి పెళ్లి కళ వొచ్చేసింది. మరో రెండు రోజుల్లో జరుగనున్న రాములోరి కల్యాణం కోసం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదిక మిథిలా స్టేడియంలోని మండపాన్ని సుందరంగా అలంకరించారు. మిథిలా స్టేడియం అంతా ఛాందినీ వస్త్రాలతో అలంకరించారు. భారీగా భక్తులు వొస్తారని అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 17వ తేదీ బుధవారం నాడు శ్రీసీతారాముల కల్యాణం, 18 తేదీ గురువారం నాడు స్వామివారి మహా పట్టాభిషేకం అంగ్నంగ వైభవంగా జరగనుంది. రామాలయం అంతా కళ్ళు మిరిమిట్లు గొలిపే విధంగా రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించారు. ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో వొస్తారనే అంచనాలతో జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేసారు.
వధువు : సీతాదేవి..వరుడు:శ్రీరామచంద్రస్
వేదిక: భద్రాచలంలోని మిథిలా స్టేడియం.. సమయం : బుధవారం ఉదయం 10.30 నుండి 12.30 గంటల వరకు
సుముహూర్తం : క్రోది నామసంవత్సర
ఛైత్రశుద్ధ నవమి 10.30 నుండి
మధ్యాహ్నం 12 గంటలకు..అభిజిత్ లగ్నం

కల్యాణ గడియలు సమీపిస్తున్నాయి. శ్రీ సీతారా ముల కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు వేలాదిగా భదాద్రికి తరలిరానున్నారు. కల్యాణానికి మిథిలా స్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఏడాది భారీగానే భక్తులు వొస్తారని అంచనా వేసిన అధికారులు అందుకణుగుణంగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రికే వివిధ ప్రాంతాల నుండి భక్తులు భద్రాచలానికి చేరుకునే అవకాశం ఉంది. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతిలో వేలాది మంది భక్తులు సేదతీరనున్నారు. మిథిలా స్టేడియంలో కల్యాణాన్ని వీక్షించేందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణం చూసేందుకు క్లోజ్డ్ ఎల్‌ఇడి టివిలను ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన వారు స్టేడియం బయటనుండే చూడాల్సి వొస్తుంది. వారి కోసం పెద్ద ఎల్‌ఇడి స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. వీకికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతిలో గోదావరి స్నానఘట్టా ంవు, విస్తా కాంప్లెక్స్ వెనుక, ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన వసతిలో ఈ ఎల్‌ఇడి టివిలను ఏర్పాటు చేశారు. భక్తులందరికీ తలంబ్రాలు ఉచితంగా అందజేసేందుకు 26 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
కల్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. ప్రతీ సెక్టార్‌కు ఓ ప్రత్యేకాధికారి విధులు నిర్వహిస్తారు. ఇప్పటికే ఆన్లైన్లో కల్యాణం, పట్టాభిషేకం టిక్కెట్ల విక్రయాలు సాగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున టికెట్ల కొనుగోళ్లు చేస్తున్నారు. అత్యంత పవిత్రంగా భావించే ముత్యాల తలంబ్రాల ఈ సారి 250 క్విటాళ్ల వరకు తయారు చేస్తున్నారు. భక్తులందరికీ తలంబ్రాలు అందేలా 60 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా 600 ప్రత్యేక బస్సులు నడుపుతున్నందున ఒక్కొక్క బస్కుకు ఒక్కొ కేజి చొప్పున తలంబ్రాలు పంపిణీ చేయనున్నారు. అంతే కాకుండా ఆన్లైన్, పోస్టు, కార్గో, కొరియర్స్ ద్వారా కూడా తలంబ్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. 2 లక్షల 50 వేల లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తున్నారు. వీటి విక్రయానికి 19 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంతో పాటు గోదావరి తీరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు గ్రామ పంచాయితీ ద్వారా తగు చర్యలు తీసుకుంటుంటున్నారు.
ఎండలు తీవ్రంగా ఉన్నందున చలువ పందిళ్లతో పాటు కార్పెట్స్ ఏర్పాటు చేయనున్నారు. కల్యాణ మండపంలో జంబో కూలర్లతో పాటు మంచి నీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులోకి తీపుకురానున్నారు. దూర ప్రాంతం నుండి వొచ్చే భక్తుల కోసం మౌలిక సదుపాయాలతో పాటు మూడు చోట్ల తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సిఎం గ్యాలరీలో ప్రత్యేక టిక్కెట్ల ధరలు అందుబాటులో ఉన్నాయని, వివిఐపి రూ.10 వేలు, విఐపి రూ.5 వేలుగా ధరలు నిర్ణయించారు. శ్రీరామ నవమి ముందురోజు అత్యంత వైభవోపేతంగా ఎదుర్కోలు ఉత్సవం జరగనుందని, స్వామి వారికి 12 వాహనాలు అందుబటాలో ఉన్నందున వాటిలో తిరువీధి సేవ జరుగుతుంది. భక్తుల కోసం 5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. అందులో 2 లక్షల ప్యాకెట్లు కార్గో పార్సిల్ ద్వారా, 20 వేల ప్యాకెట్లు పోస్టల్ ద్వారా విక్రయించనున్నారు. రాముల వారి కల్యాణాన్ని భక్తులంతా తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లతో పాటు సదుపాయాలు కల్పిస్తున్నారు. వొచ్చిన భక్తులు సజావుగా కల్యాణం వీక్షించి తిరిగి వారి గమ్యాలకు చేరేవిధంగా అధికారులు చర్యలు చేపట్టారు. భారీగా వాహనాలు వొచ్చే అవకాశం ఉన్నందున వాటికి ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో భారీగా పోలీస్ బందోబస్తు చేర్పాటు చేస్తున్నారు. దొంగలు ఎక్కువగా తిరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక పోలీస్ నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ అధికారులతో పాటుగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు.
ఎండ వేడిమికి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు….
ఎండలు మండుతుండటంతో అధికారులు అందుకణుగునంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలో కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. వివిఐపిలు కూర్చునే చోట 30 టన్నుల ఏసిలు ఏర్పాటు చేశారు. సెక్టార్లలతో మంచినీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ నీరు, అందించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బయట కూడా అనేక మంది దాతలు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర, అన్నదానం, పానకం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ప్రభుత్వం తరుఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు
ఈసారి ఎన్నికల కోడ్ ఉన్నందువలన ఏటా ఆనవాయితీగా శ్రీసీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ఎవరు తీసుకుని వొస్తారనేది వేచి చూడాల్సి ఉంది.
అభిజిత్ లగ్నంలోనే స్వామివారి కల్యాణం
శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం సందర్భంగా పావన గౌతమీ తీరం అంతా కల్యాణ శోభ ఉట్టిపడుతోంది. ప్రతి ఒక్కరు శ్రీ రాముడు సీతమ్మల కల్యాణ ఘడియల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రామాలయం ఆవరణ, కల్యాణం జరిగే మిథిలా స్డేడియం విద్యుత్ దీపాల కాంతితో దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. శిల్ప కళా శోభితమైన కల్యాణ మండపాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. శ్రీ సీతారాముల కల్యాణం చైత్ర శుద్ధ నవమి రోజైన బుదవారం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురానున్నారు. పందిళ్లను చాందినీ వస్త్రాలు, తోరణాలతో అందంగా అలంకరించారు. మండపం ఆవరణ సెక్టార్లుగా విభజించారు. కల్యాణానికి భదాద్రి తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం విస్త్రత ఏర్పాట్లు చేస్తుంది.
పట్టణంలో పలు చోట్ల శామియానాలు, చలవ పందిళ్లు వేసి అప్రాంతాలలో మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తున్నారు. కాఫీ, టిఫిన్, భోజనం తక్కువ ధరలకే లభించే విధంగా హోటల్ యాజమాన్యాలకు అధికారులు సూచించారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులతో వైద్యశిబిరాలను సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు 108 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ఆర్‌టిసి బస్సులు ఈ ఏడాది సాధారణంగా తిరిగే బస్సులతో పాటు అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగ కుండా చూస్తున్నారు. క్నవ్యణం సందర్భంగా పలు సంఘాలు, కంపెనీలు, సేవా సమితిలు మంచినీళ్లు, మజ్జిగ, పులిహోర ప్యాకెట్లు, బెల్లం పానకం, అన్నదానం ఉచితంగా పంపినీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.





