భక్తిశ్రద్ధలతో అయ్యప్ప ఇరుముడి పూజ కార్యక్రమం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : కడ్తాల గ్రామంలో మంగళవారం స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో చందర్ గురు స్వామి, ముకుంద గురు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ, ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. పడిపూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి పాల్గొన్నారు. దేవాలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇరుముడి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించినందుకు నిర్వాహకులు శ్రీశైలం, వెంకటేష్, బాల్ రాజు గురుస్వాములు ఇతర స్వాములను అభినందించారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని కోరారు. అనంతరం స్వాములు శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాదారం గణేష్ గౌడ్, గురిగళ్ళ జంగమ్మ రామచంద్రయ్య, గ్రామ పెద్దలు శిశుపాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, నాయకులు అంజయ్య, రవి, శేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *