– అడ్డుకున్న సహస్రను చంపేసిన బాలుడు
– వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి
హైదరాబాద్,ఆగస్ట్23(ఆర్‌ఎన్‌ఎ): ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీస్‌లు చూసి.. పక్కాగా ప్లాన్ చేసి.. ఎనిమిదేండ్ల సహస్రను పదో తరగతి విద్యార్థి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఒక్క బ్యాట్ కోసమే ఆ బాలికను చంపినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఇవాళ వెల్లడించారు. అయితే సహస్ర హత్యకు కారణమైన బ్యాట్‌ను పోలీసులు డియా ముందు ప్రదర్శించారు. ఇక ఆ బ్యాట్‌పై రెడ్ కలర్ గుర్తులో ఎంఆర్‌ఎఫ్ అని రాసి ఉంచారు. సహస్ర తమ్ముడు రెగ్యులర్‌గా ఈ బ్యాట్‌తో క్రికెట్ ఆడేవాడని, దాన్ని చోరీ చేయాలనే ఉద్దేశంతోనే సహస్ర ఇంటికి చోరీకి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలిందని సైబరాబాద్ సీపీ తెలిపారు. కిచెన్‌లో ఉన్న బ్యాట్‌ను చోరీ చేసే క్రమంలో చిన్న అలజడి రేగడంతో.. సహస్ర అప్రమత్తమై ఎదురించింది. దీంతో ఆమెను బెడ్‌రూంలోకి తోసేసి కత్తితో 18 సార్లు పొడిచి చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే ఈ నేరాన్ని అంగీకరించేందుకు నిందితుడు.. రకరకాల కట్టుకథలు సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. చివరకు అతని ఇంట్లో ఉన్న రక్తపు మరకలతో కూడిన బట్టలు, కత్తి అతన్ని పట్టించాయన్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి సహ్రస హత్య కేసు మిస్టరీ వీడింది. హత్య కేసు మిస్టరీని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. సహస్రను చంపింది పక్కింటి పదో తరగతి బాలుడు అని తెలిపారు. సహస్ర హత్యకు గురైన రోజే తమకు అనుమానం వచ్చి బాలుడిని విచారించామని.. కానీ తనకే తెలియదని అబద్ధం చెప్పాడన్నారు. నాలుగు రోజుల పాటు అనేక మందిని విచారించామని.. అయితే ఓ పిల్లోడు క్లూ ఇచ్చాడని.. హత్య జరిగిన రోజు ఆగస్టు 18న ఉదయం 8:30-8:40 గంటల సమయంలో సహస్ర ఇంటి సపంలో నిందితుడు తచ్చాడుతూ కనిపించినట్లుగా పిల్లోడు సమాచారం ఇచ్చాడని.. దీంతో తమ అనుమానం బలపడిందన్నారు. అనంతరం బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్ల నుంచి నిందితుడు సరిగ్గా స్కూల్‌కు వెళ్లడం లేదని.. ఓటీటీలో క్రైమ్ సినిమాలు, మిస్టరీ సీన్లు చూడ్డాం. యూట్యూబ్‌లో క్రైమ్ థిల్లర్ మూవీలు చూడ్డాం అలవాటు చేసుకున్నాడని.. ఎప్పుడూ స్కూల్ ఎగ్గొట్టి క్రికెట్ ఆడుతుంటాడని తెలిపారు. హత్య జరిగిన రోజు నిందితుడి ఇంట్లో తల్లి తప అందరూ ఉన్నారని.. అదే రోజు తల్లి అడిగితే తనకే తెలియదని అబద్ధం చెప్పాడన్నారు. చివరికి తనకే తెలియదని ఒట్టు కూడా వేశాడని ఆమె తెలియజేసినట్లుగా పేర్కొన్నారు. అయితే రెండు నెలల క్రితం చేతిలో మొబైల్ చూసి.. ఇదెక్కడిది అని అడిగితే సమాధానం ఇవ్వలేదని తల్లి చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. ఇక హత్య చేసిన తర్వాత ఇంటి బయట కత్తి కడిగి.. లోపలికి వెళ్లి ప్యాంట్, టీ షర్ట్‌తోనే స్నానం చేసి అనంతరం ఆ బట్టలను వాషింగ్ మిషన్‌లో వేసేశాడని వివరించారు. అయితే తమకు అనుమానం ఇచ్చి నిందితుడి ఇల్లు తనిఖీ చేయగా ఒక లెటర్ దొరికిందని.. అది ఈ హత్య కోసం కాదని చెప్పారు. ఇక అదే రోజు కుందేల్ కూడా చనిపోయిందని.. దాని స్టోరీ కూడా తమకు చెప్పాడని పేర్కొన్నారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా కుందేల్ బతకలేదని చెప్పినట్లుగా తెలిపారు. కేవలం సహస్ర తమ్ముడి బ్యాట్ నచ్చడంతో.. దాన్ని దొంగిలించాలని స్కెచ్ వేశాడని.. చోరీ చేస్తుండగా సహస్ర చూడడంతో చంపేశాడని పోలీసులు వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




