బీహార్‌ ‌కల్తీ మద్యం కేసులో .. 39కి చేరిన మృతుల సంఖ్య

  • పరిహారం ఇవ్వలేమన్న సిఎం నితీశ్‌
  • ‌మద్యం నిషేధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వెల్లడి

పాట్నా, డిసెంబర్‌ 15 : ‌కల్తీ మద్యంలో మృతిచెందిన వారికి పరిహారం ఇవ్వడం కుదరదని సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌తేల్చిచెప్పారు. కల్తీ మద్యంతో ప్రాణాలు పోతాయని తెలిసీ తాగితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు. బీహార్‌లో కల్తీ మద్యం తాగిన కేసులో మృతిచెందిన వారి సంఖ్య 39కి చేరుకున్నది. శరన్‌ ‌జిల్లాలోని చాప్రా ప్రాంతంలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌స్పందించారు. కల్తీ మద్యం సేవిస్తే, ప్రాణాలు కోల్పోతారని ఆయన అన్నారు. చాప్రా విషాదంపై ఆయన డియాతో మాట్లాడుతూ.. మద్య నిషేధం లేని రోజుల్లో కూడా ఇక్కడ కల్తీ మద్యం తాగి జనం చనిపోయినట్లు సీఎం తెలిపారు. ఇతర రాష్టాల్ల్రోనూ ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడ లిక్కర్‌ ‌బ్యాన్‌ ఉం‌దని, కల్తీ మద్యాన్ని అమ్ముతారని, దాని వల్ల ప్రజలు చనిపోతారని, మద్యం మంచిది కాదని, ఎవరూ తాగకూడదని సీఎం నితీశ్‌ అన్నారు.కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని గతంలో కొందరు డిమాండ్‌ ‌చేశారని, ఎవరైనా మద్యం సేవిస్తే ప్రాణాలు కోల్పోవడం తప్పదని, మన కళ్ల ముందే ఇవన్నీ కనిపిస్తున్నాయని, ఇలాంటి ఘటనలు విషాదాన్ని మిగిల్చుతాయని, ఆ ప్రాంతాలను విజిట్‌ ‌చేసి, వారికి కల్తీ మద్యం గురించి వివరించాలని సీఎం నితీశ్‌ ‌తెలిపారు. పేదలను అరెస్టు చేయవద్దు అని అధికారుల్ని ఆదేశించానని, కానీ లిక్కర్‌ను తయారు చేసే వాళ్లను, ఆ వ్యాపారాన్ని నిర్వహించేవాళ్లను పట్టుకోవాలని ఆదేశించినట్లు సీఎం నితీశ్‌ ‌తెలిపారు.

మద్య నిషేధం వల్ల చాలా మంది ప్రజలు బెనిఫిట్‌ ‌పొందారని, ఎంతో మంది మద్యాన్ని త్యజించారని, ఇది మంచి పరిణామం అని, అనేక మంది మద్య నిషేధ నిర్ణయాన్ని స్వాగతించారని, కానీ కొందరు ఎప్పుడూ సమస్యలు సృష్టిస్తుంటారని, అలాంటి వాళ్లను పట్టుకోమని అధికారులకు ఆదేశించినట్లు సీఎం నితీశ్‌ ‌తెలిపారు. బిజెపి నష్టపరిహారం డిమాండ్‌ ‌చేయడాన్ని తప్పుపట్టారు. బిహార్‌ ‌లో జరిగిన కల్తీ లిక్కర్‌ ‌ఘటనపై తీవ్రంగా చర్చ సాగుతోంది. కల్తీ లిక్కర్‌ ‌తాగే వారు చనిపోవడం సాధారణమైన విషయమేన న్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న ఆయన..  తాము రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నిషేధంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహాత్మా గాంధీ ఏం చెప్పారో కు తెలుసన్న నితీష్‌… ‌

ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఏం చెబుతున్నాయని ప్రశ్నించారు. మద్యం ప్రమాదకరమని ఇంటింటికి తెలియజేస్తున్నామని, చాలా కాలంగా కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారని తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకున్నామని, అయితే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నితీష్‌ ‌కుమార్‌ ‌సూచించారు. నిషేధం ఉన్నా కూడా కొందరు విక్రయిస్తున్నారంటటే అందులో తప్పుందని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *