తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 13: తాండూర్ నియోజకవర్గం లో వివిధ నామినేటెడ్ పదవుల్లో బీసీ కులాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కె బీసీ బంధువులందరూ ఓటేద్దామని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మద్దతుగా రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ సంఘం ప్రతినిధులు పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీల సంక్షేమంపై రోహిత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా బీసీ కులాలకు చెందిన నాయకులకు తాండూర్ లో నామినేటెడ్ పదవుల్లో అత్యధిక స్థానాలు కేటాయించడంలో రోహిత్ రెడ్డి ముందున్నారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెండుసార్లు బీసీలకు కేటాయించారని తాండూర్ లో ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ లను బీసీలకే కేటాయించారని దాదాపుగా అన్ని దేవాలయాలకు చెందిన చైర్మన్లను కూడా బీసీ కులాలకు చెందిన వారికి రోహిత్ రెడ్డి కేటాయించారని అన్నారు. ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని బీసీ కులాలకు చెందిన బంధుమిత్రులు పెద్ద మొత్తంలో ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిసి రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ సుకుర్ బీసీ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ బీసీ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శి అనిత బిసి మండలాల అధ్యక్షులు నరేందర్ బసంత్ సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్ బీసీ నాయకులు రాము ముదిరాజ్ టైలర్ రమేష్ ప్రవీణ్ గౌడ్ నరేష్ నర్సింలు శోభన్ అనిల్ కుమార్ నవీన్ సురేందర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు ప్రాధాన్యత కల్పించిన బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డికె ఓటువేద్దాం





