బీసీ అభ్యర్థిని సీఎం చేయడం బిజెపితోనే సాధ్యం దౌల్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు సతీష్ ముదిరాజ్

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 18: బీసీ అభ్యర్థిని సీఎం చేయడం కేవలం బిజెపి పార్టీతోనే సాధ్యమని భారతీయ  జనతా పార్టీ దౌల్తాబాద్ మండల అధ్యక్షులు సతీష్ ముదిరాజ్ అన్నారు కొడంగల్ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ కొడంగల్ నియోజకవర్గ  అభ్యర్థి బంటు రమేష్ కుమార్ కి మద్దతుగా బిజెపి దౌల్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో బిజెపి మండల అధ్యక్షులు సతీష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ స్థానాలతో అధికారంలోకి రాబోతుందనీ ఒక బిసి అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని అన్నారు  భారతీయ జనతా పార్టీకి మద్దతుగా దౌల్తాబాద్ మండల ప్రజలు ముందుకు రావాలని దేశ సమగ్రత దేశ భద్రత కేవలం బిజెపి పార్టీతోనే సాధ్యమని దేశ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారని రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి  ప్రజలు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా వారు ప్రజలను   ఉద్దేశించి మాట్లాడారు దౌల్తాబాద్  మండల ప్రజలు అందరూ ఇక్కడ బీసీ అభ్యర్థికి మద్దతు తెలపాలని బంటు రమేష్ నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా వారు ప్రజలను కోరారు . కొడంగల్ లో ఇప్పటివరకు గెలిచినటువంటి అభ్యర్థులు కోడంగల్ అభివృద్ధి గురించి ఎవరు కొట్టించుకోలేదనీ బంటు రమేష్ ఎమ్మెల్యేగా గెలిస్తే కొడంగల్ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా తీర్చేదిద్దుతారని అన్నారు .  ఈ  కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శిలు అశోక్, మొగులప్ప, ఓబిసి మోర్చా అధ్యక్షులు జంబులప్ప, మండల ఉపాధ్యక్షుడు చామంతి శ్రీశైలం, రాజశేఖర్, నాయకులు రాము, సంజీవ, సురేష్, వెంకటేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *