- పక్కకు ఒరిగిన పలు బోగీలు..తప్పిన ముప్పు
- పలు రైళ్లు ఆలస్యం….దెబ్బతిన్న ట్రాక్ వేగంగా పునరుద్ధరణ
యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు బీబీనగర్ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. రైలులోని ఐదు బోగీలు పట్టాలపైనుంచి పక్కకు జరిగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.
బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రయాణికులను బస్సుల్లో వారి గమ్యస్థానాలకు పంపిచామన్నారు. కాగా, గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ రైలు విశాఖలో సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుటుంది. ఈరైలులో వందలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు.
పలు రైళ్లు ఆలస్యం….దెబ్బతిన్న ట్రాక్ వేగంగా పునరుద్దరణ
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం తెల్లవారుజామున బీబీ నగర్ వద్ద పట్టాలు తప్పడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్ లోని ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతిన్నది. సుమారు కిలోవి•టర్ మేర ట్రాక్ దెబ్బతిన్నది. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని మరమ్మత్తులు చేపట్టారు. ట్రాక్ దెబ్బ తినడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ -1, ఎస్ -2, ఎస్ – 3, ఎస్ – 4తో పాటు రెండు జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి. అయితే అధునాతన రైల్వే బోగీలు కావడంతో పెను ప్రమాదం తప్పింది. పట్టాలు తప్పిన బోగీలను రైలు నుంచి వేరుచేశారు. మిగిలిన 15 బోగీలతో రైలు సికింద్రాబాద్ చేరుకున్నది