బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

కుల్కచర్ల, ప్రజాతంత్ర 30: బీజేపీతోనే తెలంగాణ  అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర కిసాన్ మొర్చ ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్ బూనేటి, జిల్లా ప్రధాన కార్యదర్శి గణపురం వెంకటయ్య గౌడ్ లు అన్నారు.సోమవారంనాడు మండలంలోని పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామలింగేశ్వర స్వామి దేవాలయం నుండి విజయ సంకల్ప యాత్ర  బీజేపీ మండల అధ్యక్షులు గాదె మహిపాల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల తో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో విద్యా, వైద్యం, యువతకు ఉపాధి,వ్యవసాయం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.ఈ కార్యక్రమంలో పరిగి నియోజకవర్గ కన్వీనర్ కేశవులు,చౌడాపూర్, దోమ మండల అధ్యక్షులు రాంరెడ్డి, బందయ్య,కుల్కచర్ల బీజేవైయం మండల అధ్యక్షుడు గడుసు మహిపాల్,మండల నాయకులు హన్మంతు , వార్డు సభ్యులు కాటన్ మహిపాల్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *