సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 1: సిద్దిపేట పట్టణానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు ఇంద్రా రాణి బీజేపీ పార్టీ కి రాజీనామా చేసి తన అనుచరులతో మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. సిద్దిపేట అభివృద్ధిలో… మంత్రి హరీష్ రావు మెజారిటీ లో భాగస్వామ్యం అవుతనని ఈ సందర్బంగా ఆమె తెలియజేశారు. ఆమెతో పాటు దాదాపు 30మంది కార్యకర్తలు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. బండి రేణుక జనరల్ సెక్రటరీ, రజిత ఉపాధ్యక్షురాలు, నిర్మల, లక్ష్మి లావణ్య తదితరులు చేరారు.
బీజేపీకి రాజీనామా చేసి బిఆర్ ఎస్ లో చేరిన సిద్దిపేట పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఇంద్రారాణి




