మహేశ్వరం ప్రజాతంత్ర అక్టోబర్ 31: మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ కాంటెస్టడ్ కార్పోరేటర్, మహిళ మోర్చా అధ్యక్షురాలు అనిత, గిరిజన మోర్చా అధ్యక్షులు రమవత్ హాథిరామ్ నాయక్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ నాయకులతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ కండువాలు కప్పి బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రతి ఒక్కరు ఆకర్షితులై బి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రాష్టం మరింత అభివృద్ది సాధించడం కోసం ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అకర్షితులై బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నియోజకవర్గ ప్రజల కోసం అలుపెరుగకుండా కృషి చేస్తున్న సబితమ్మ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
బీజేపీకి బిగ్ షాక్





