– దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు సహాయం కోసం ఎదురుచూపులు
కందుకూరు, ప్రజాతంత్ర,జూలై 26 : కెసిఆర్ ప్రభుత్వం తలపెట్టిన బిసిలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందేనా? అని బిసి లబ్దిదారులు మదన పడుతున్నారు.కెసిఆర్ బిసిల పట్ల చూపెడుతున్న ప్రేమనురాగాలను పక్కనపెట్టి వివక్ష చూపుతున్నారని బిసిలు మండిపడ్టున్నారు.దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మహేశ్వరం నియోజకవర్గంలో చాలామంది ఉన్నారని,వీరికి సకాలంలో కెసిఆర్ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటారా?అనే ప్రశ్న మొదలైంది.కందుకూరు మండలంలో 1310 మంది దరఖాస్తు చేసుకోగా వారికి ఎవరు నిజమైన లబ్ధిదారులు ఎవరు కారు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.జూలై 15న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బిసి కులాలకు చెందిన లబ్ధిదారులకు సహాయం అందజేస్తారని అనుకున్న నేపథ్యంలో నేటికీ కనీసం ఒక్కరికి కూడా అందజేయకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.బిసి కులాలపై కెసిఆర్ ఎత్తుగడలను గమనిస్తూ తమకు వస్తుందా లేదా అన్న మీ మాంసంలో బిసి కులాలు పడ్డాయి.బిసి కులాలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడం వారికి పరిపాటి అయిందని పలువురు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా నియోజకవర్గానికి 300 మందికి మాత్రమే లక్ష రూపాయల చొప్పున ఆదుకుంటామని గొప్ప గొప్ప ప్రకటనలు చేసి నేటికీ వారికి ఆర్థిక సహాయం అందజేయకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు బిసి నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఎన్నికల ముందు కెసిఆర్ ప్రభుత్వం ఇలాంటి వాగ్దానాలను ఇచ్చి దళిత బంధు,బిసి కులాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం,ముస్లింలకు లక్ష రూపాయల ఆర్థిక చేయూత అందిస్తానని గొప్ప గొప్ప ప్రగాల్బాలు పలికి బిసి వర్గాలను మైనార్టీ వర్గాలను అణచివేతకు గురి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చిన కెసిఆర్ ప్రభుత్వం ఇవ్వడంలో బిసి వర్గాలను నైరాశకు గురి చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. మీకు చేతనైతే ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రతి లబ్ధిదారునికి చేయూతనివ్వాలని బిసి నేతలు డిమాండ్ చేస్తున్నారు.రక రకాలుగా పలకడమే కాకుండా ఇచ్చిన వాగ్దానాలను సకాలంలో నెరవేర్చి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని వారు సూచించారు.రాష్ట్రంలో ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది బిసిలు దరఖాస్తు చేసుకోగా దరఖాస్తులు ద్వార వచ్చిన పైకం70 కోట్లకు చేరుకుందని వాటి ద్వారానే బిసిలలో లబ్ధిదారులను ఎంపిక చేసి విడుదల చేసి వారికి రుణాలు పంపిణీ చేయాల్సి ఉందని కానీ అందుకు విరుద్ధంగా కెసిఆర్ నామమాత్రంగా రెండు,మూడు జిల్లాల్లో పది ఇరవై మందికి ఇచ్చి చేతులు దులుపుకున్న చందంగా ఉందని,కొందరికి మాత్రమే లక్ష రూపాయల సహాయం అందజేశారని బిసి నేతలు మండిపడుతున్నారు.బిసిలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేయమని ఎవరైనా కోరారా?అని ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం బిసి ఓట్ల కోసమే రాజకీయపరంగా అడుగులు ముందుకు వేస్తుందని బిసి వర్గాలు ఆరొపిస్టున్నాయి.జూలై 15 న ప్రారంభం కావలసిన రుణాల పంపిణీ నేటికీ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నిస్తున్నారు.బిసిలు అంటే అంత చులకనా?లేక గొర్రెల మాదిరిగా తల ఊపుతారని అనుకుంటున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.బిసిలు చేసుకున్న దరఖాస్తుల వల్ల వచ్చిన రాబడి ప్రభుత్వం ఇతరత్రా కార్యక్రమాలకు వినియోగిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గ్రహించి ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.లేని పక్షంలో బిసిల రణభేరిని చవిచూడాల్సి వస్తుందని ఖరాఖండిగా తెలుపుతున్నారు.ఇప్పటికైనా బిసి రుణాల ప్రక్రియను వేగవంతం చేసి లబ్దిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించి చేయూత నివ్వాలని పలువురు సూచిస్తున్నారు.లేని యెడల వచ్చే ఎన్నికల్లో బీసీలు కెసిఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చేప్తమని పలువురు బిసి నేతలు హెచ్చరించారు.




