కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 7 : తల్లికి బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని దానితో బిడ్డ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుందని మండల పరిధిలోని బాచుపల్లి గ్రామ సర్పంచ్ యాలాల శ్రీనివాస్ తెలిపారు.సోమవారం తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,బిడ్డ పుట్టగానే తల్లిపాలు పట్టించి మొదటి టీకా లాగా భావించాలని ఆమె పేర్కొన్నారు.చంటి పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేయస్క్రరమని ఆయన అన్నారు. అంగన్వాడి సెంటర్ లో ఇచ్చే బాలామృతం,గుడ్లు తదితర పోషక పదార్థాలను తప్పకుండా తీసుకువెళ్లి ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ యాదమ్మ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి,వర్కర్ మంజుల తదితరులు పాల్గొన్నారు.




