బిజెపి నాయకుల మాటలన్నీ అబద్ధాలే యువజన అధ్యక్షుడు  కొమ్ము ప్రశాంత్

ఘట్కేసర్ ప్రజాతంత్ర నవంబర్ 1 : బిజెపి నాయకులు అబద్ధాలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పోచారం బిఆర్ఎస్ యూవజన సంఘం అధ్యక్షులు కొమ్మ ప్రశాంత్ హెచ్చరించారు. పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం కొమ్ము ప్రశాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిజెపి నాయకులు బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసినా కూడా చెయ్యలేదని మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి మల్లారెడ్డి రాజీవ్ గృహకల్ప లో తన సొంత నిధులతో పార్కును, గుళ్లను, రోడ్లను, ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు. ఈరోజు అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక అబద్ధాలు మాట్లాడుతున్నారూ బిజెపి నాయకులు అని మండిపడ్డారు. మా మంత్రి మల్లారెడ్డి, బీఆరెస్ నాయకులపై అనుచుత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు. మేడ్చల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *