బిజెపి నాయకుల ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : కడ్తాల మండలంలోని పలుతాండాలలో బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారికి మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బిజెపి గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి సాయి లాల్ నాయక్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందించడం జరుగుతుందని వారన్నారు. ఆడపిల్లల కోసం బేటి పడావో బేటి బచావో, ఎరువులకు వ్యవసాయ సబ్సిడీ, నిరుపేద మహిళలకు ఉజాల పథకం ద్వారా సిలిండర్లు అందజేత. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పక్క గృహాలు నిర్మించుట ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగిందన్నారు. సోమవారం కడ్తాల మండలంలోని  నార్లకుంట తండా, వంకరాయి తండా, కాడియ్య తండా, రాజీవ్ నగర్ తండా, బాలాజీ నగర్ తండా, రేకులకుంట తండా లో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్, ముణేష్ నాయక్, రాజు నాయక్, రమేష్, శ్రీకాంత్, నవీన్, వినోద్, జగన్, బాలు, దశరథ, చత్రు, రాకేష్, పత్యా, వినోద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *