బిజెపి కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు దళిత బంధు పై ఓర్వలేకనే దళితుల్లో చిచ్చు

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 19: దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు విడతల వారీగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి అందజేయడం జరుగుతుందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.శుక్రవారం జగదేవపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బిజెపి కాంగ్రెస్ దళిత బంధు కోసం కావాలని ఇతరులతో ధర్నాలు చేపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఆంధ్ర షర్మిలకు ఏమి అవసరమని తిగుల్ గ్రామానికి వస్తానంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బుద్ధ నాగరాజు,మాజీ సర్పంచ్ కొంపెల్లి కరుణాకర్,ఉపసర్పంచ్ మల్లేశం, వార్డుసభ్యులు కొంపెల్లి మహేష్,,గణేష్ నాయకులు రాజు గౌడ్, బండ శ్రీను, సాయి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *