బిజెపి అభ్యర్థిని గెలిపిస్తే కత్వ వాగు నిర్మాణం పూర్తి చేయిస్తాం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 27 : బిజెపి అభ్యర్థి ఆచారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మేడిగడ్డ శంకర్ గ్రామాల మధ్యన ఉన్న ఖత్వవాగు నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామని సర్పంచ్ అమర్ సింగ్ అన్నారు. సోమవారం శంకర్ కొండ, సామామయపల్లి తండాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డమ్మీ ఈవీఎంలతో ప్రచారం నిర్వహించి నెంబర్ 1 బటన్ పై  వోత్తి ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో సామయపల్లి తాండ బిజెపి గిరిజన మోర్చా అధ్యక్షులు మణిపాల్ నాయక్, తెనాలి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *