బిజెపి అన్నింటా వైఫల్యం

  • అనేక చోట్ల ఓడినా గుజరాత్‌నే ఫోకస్‌
  • ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్మయ్య

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‌చేతిలో బిజెపి ఓడిపోయిందని కాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్ష్మయ్య తెలిపాడు. అయినా గుజరాత్‌ ‌ఫలితాలపైనే ఎందుకు ఫోకస్‌ ‌పెట్టారని ప్రశ్నించారు. తన ఫేస్‌ ‌బుక్‌ ‌ఖాతా నుంచి పొన్నాల మాట్లాడారు. బిజెపి రాజస్థాన్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌చేతిలో 26,852 వోట్లతో ఓడిపోయిందన్నారు. ఛత్తీస్‌ ‌ఘడ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌చేతిలో బిజెపి 21,171 వోట్లతో ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. ఒడిశా ఉప ఎన్నికల్లో బిజెడి చేతిలో బిజెపి 42,679 వోట్లతో ఓడిపోయిం దన్నారు.

ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో ఎంపిగా 2,88,461 వోట్లు, ఒక ఎంఎల్‌ఎ 22,143 ఓట్లతో తేడాతో ఎస్‌పి చేతిలో బిజెపి ఓటమిని చవి చూసిందని ధ్వజమెత్తారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ ‌చేతిలో బిజెపి భంగపడింది. బీహార్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, ‌జెడియుపై కేవలం 3,600 తేడాతో బిజెపి గెలిచింది. కేవలం గుజరాత్‌ ‌రాష్ట్రంలో గెలవడంతోనే దేశంలో బిజెపి గాలి ఉంది అని ప్రచారం చేయడం సరికాదని చురకలంటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *